Nadu Nedu
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని పుస్తకరూపంలోకి తేవడం అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఎలాంటి దుర్భర స్థితిలో ఉంది? ఈరోజు ఎంతటి అభివృద్ధి సాధించింది అనే విషయాలను కళ్లకు కడుతూ ‘నాడు నేడు’ పేరిట వచ్చిన ఈ పుస్తకం ఎంతో అద్భుతమైనదని అన్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితుల గురించి అందమైన చిత్రాలతో రూపొందించిన పుస్తకం నాటి, నేటి పరిస్థితులను ప్రస్ఫుటిస్తోందని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, పాల వెంకటరెడ్డి, కనగాల వెంకట్రావు, మల్లూరు అంకమరాజు, దొడ్డా శంకర్‌రావు, భీమిరెడ్డి గోపాలరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, రఫీ, గొర్ల సంజీవరెడ్డి, దయాకర్ పాల్గొన్నారు.
Publication Language |
Telugu |
---|---|
Publication Access Type |
Premium |
Publication Author |
* |
Publisher |
Magzter |
Publication Year |
2024 |
Publication Type |
eBooks |
ISBN/ISSN |
* |
Publication Category |
Magzter eBooks |
Kindly Login to ONGC Uran, Digital Library.